శతకం అంటే ఏమిటి, వాటి ప్రయోజం ఏమిటి

శతకం అనేది ఓ సాహితీ పక్రియ. ఇది  వంద పద్యాలు  పద్యాలతో రచించబడుతుంది.  నూట ఎనిమిది, నూట పదహారు పద్యాలుం డటం కూడా చాలా సార్లు జరుగుతూంటుంది.  అలాగే వేమన శతకంలో వెయ్యికి పైగా ఉన్నా శతకం అనటం సంప్రదాయం. సంస్కృతంలోనూ త్రిశతి, పంచశతుల పేర్లతో శతకాలున్నాయి. ఒకే మకుటం ఉండాలి. పద్యంలో చివర సంబోధనగా ఉండే సుమతీ, భాస్కరా వంటి వాటిని మకుటం అంటారు. శతకంలోని పద్యాలన్నింటికీ ఒకటే మకుటం ఉండాలి. వేమన శతకంలో చివరిపాదం అంతా మకుటమే. రెండు పాదాల మకుటం కలిగినది ఆంధ్రనాయక శతకం.
ఇక తెలుగు సాహిత్య ప్రక్రియలలో సామాన్య జన జీవనానికి కూడా చదివి అర్ధం చేసుకోవటానికి వీలుగా ఉన్నవి శతకములు అని చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా ఎంతో లోతయిన భావాలను కూడా మనం  రోజూవారి మాట్లాడే వాడుక భాషలోని పదములతో చెప్పి, సామాన్య మానవుని కూడా జ్ఞానం కలగ చేస్తూ జ్ఞానిని చేయగలిగినవి ఈ శతకములు.  
శతకముల వలన ప్రయోజనం ఏమిటి ?
చిన్నప్పటి నుంచే పిల్లలకు అంటే దాదాపు  మాటలు పలుకటం వచ్చిన శతకాలని నేర్పించటం వలన వారి స్పష్టమైన ఉచ్చారణ కలుగుతుంది. మాతృభాషపై పట్టు, ఇష్టంకలుగుతుంది. భావ వ్యక్తీకరణ తెలియటంతో పాటు, జ్ఞాపక శక్తీ వృది చెందుతుంది. మరికొన్ని ముఖ్యమైన శతకాలు
కవిచౌడప్ప శతకం-అశ్లీలం, తిట్టు గలదిఆంధ్రనాయక శతకం-కాసుల పురుషోత్తమ కవి వ్యాజస్తుతి శతకంసిరిసిరి మువ్వ శతకం- శ్రీశ్రీ (అధిక్షే పశతకం)పిల్లీ శతకం- బోయిభీమన్న /అన్యాపదేశ శతకంటెంకాయ చిప్ప శతకం- వావిలికొలను సుబ్బారావు (అధిక్షేపం)చీపురుకట్ట శతకం- వేంకటాద్రి శాస్త్రి (హాస్యం)అభినవ వేమన శతకం- బేతవోలు రామబ్రహ్మం (ప్యారడీ శతకం)సుభాషిత త్రిశతి- ఏనుగు లక్ష్మణకవి అనువాదం- బర్తృహరి సుభాషితాలకు.సింహాద్రినారసింహ శతకం-గోకులపాటి కూర్మనాథకవిహరిజన శతకం- కుసుమధర్మన్నకవిభారతీశతకం-గిడుగు సీతాపతిమాతృశతకం-దువ్వూరి రామిరెడ్డిమధ్యాక్కరలు-విశ్వనాథభక్త చింతామణీ శతకం-వడ్డాది సుబ్బరాయకవి. 
ఈ శతకముల గురించి మన పెద్దలు ఏమన్నారో చూడండి
చట్టాన్ని చెబుతుంది శాస్త్రం హితాహితాలు చెబుతుంది ఇతిహాసం బుద్దులు చెబుతుంది పురాణం సుద్దులు చెబుతుంది శతకం